-->

Ads 720 x 90

Fiksioner Free Blogger Theme Download

విజయ్ దేవరకొండ సక్సెస్ స్టోరీ

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి పెద్ద సక్సెస్ ని అందుకొని హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ సక్సెస్ స్టోరీ మనం ఇప్పుడు చదువుతున్నాం. 2017 ఆగస్టు 25 వ తేదీన అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ లైఫ్ ఒక్కరోజులోనే టర్న్ అయిపోయింది. 1989లో వచ్చిన శివ సినిమా తరువాత అంత రేంజ్లో అందుకున్న తర్వాత సినిమా అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సూపర్ గా నటించారు ఈ సినిమాకు గాను 2017లో బెస్ట్ యాక్టర్ జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ ని అందుకున్నాడు. ఇతని గురించి ఇప్పుడు మనం మొదటినుంచీ తెలుసుకుందాం. ఇతని పూర్తి పేరు విజయ్ సాయి దేవరకొండ ఇతను 1989 మే 9న నాగర్ కర్నూల్ లోని అచ్చంపేట అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు దేవరకొండ గోవర్ధనరావు ఇతడు తెలుగు సీరియల్ లో దర్శకుడు. తల్లి పేరు మాధవి ఈమె స్పీక్ ఈజీ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ నడిపేవారు. ఇందులో విజయ్ దేవరకొండ పాకెట్ మనీ కోసం కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కూడా చెప్పేవాడు. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు ఆనంద్. విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి హయ్యర్  సెకండరీ స్కూల్ లో చదువుకున్నాడు. తర్వాత హైదరాబాదులోని బద్రుక కాలేజీ లో డిగ్రీ పూర్తి చేశాడు. విజయ్ చిన్నప్పటినుంచి డ్రైవర్ కావాలనుకున్నాడు కానీ డిగ్రీ చదువుతున్నప్పుడు అతని దృష్టి సినిమా రంగం వైపు వెళ్ళింది. ఆ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా కావాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను ఆయన యాక్టింగ్ నేర్చుకోవాలని యాక్టింగ్ లో చేరాడు చిన్న చిన్న స్టేజ్ నాటకాలను కూడా వేసేవాడు. విజయ్ దేవరకొండ కు 2011లో నువ్విలా సినిమా ద్వారా చాన్స్ లభించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్రికెట్ ప్లేయర్ గా నటించాడు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నటించాడు. ఈ రెండు సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేయడం వల్ల విజయ్ దేవరకొండ పెద్దగా పేరు రాలేదు. 2010లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నానికి విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి ఎంతో గొప్పగా నటించాడు ఈ సినిమా విజయ్ దేవరకొండ కు మంచి పేరు తెచ్చింది. 2016లో పెళ్లి చూపులు సినిమా తో విజయ్ దేవరకొండ మొదటి సారిగా హీరో గా కనిపించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. 75 లక్షలు పెట్టి తీసిన ఈ సినిమా ఏకంగా 29 కోట్లను సాధించింది. అంతేకాకుండా బెస్ట్ సినిమాగా నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా అందుకుంది.కానీ విజయ్ దేవరకొండ సక్సెస్ ని మాత్రం 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా తో అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అవ్వకముందే అనేక వివాదాలకు గురయింది. 2017 ఆగస్టు 25న రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. నాలుగు కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా 50 కోట్లను సాధించి పెట్టింది ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక రేంజ్ లో ముందుకెళ్లాడు. 2018 లో వచ్చిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ విజయ్ ఆంథోని గా నటించాడు విజయ్ దేవరకొండ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు ఈయన పై మీ కామెంట్ కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.Read more

Related Posts

Subscribe Our Newsletter